Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టబుతో 28 ఏళ్ల తర్వాత రొమాన్స్ చేయనున్న వెంకీ?

టబుతో 28 ఏళ్ల తర్వాత రొమాన్స్ చేయనున్న వెంకీ?
, మంగళవారం, 11 జూన్ 2019 (15:44 IST)
అందాల సీనియర్ నటి టబు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబూ కీలక పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. 
 
ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది.

28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన నటించబోతోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సాహో'' టీజర్ వచ్చేస్తోంది.. డార్లింగ్ కోసం జపాన్ యువతుల డ్యాన్స్