Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో వున్నాను.. త్వరలో పెళ్లి: పృథ్వీరాజ్

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (15:03 IST)
Prithivee
పెళ్లి ఫేమ్ పృథ్వీరాజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడు. సహనటుడుగా, ప్రతి నాయకుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు పృథ్వీ. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా వున్న ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కొద్దిరోజులుగా పృథ్వీ మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ. 
 
అయితే ఆ అమ్మాయికి 23 ఏళ్లు కాదని.. 24 అని.. అలాగే.. ఇంకా తమకు పెళ్లి కాలేదని.. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్‏షిప్‏లో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. ఆ అమ్మాయి మలేషియాకు చెందిన యువతి కాదని.. తెలుగమ్మాయి అని స్పష్టం చేశారు.
 
పృథ్వీరాజ్ 1994లో బీనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న పృథ్వీ తెలుగమ్మాయి అయిన శీతల్‏తో ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వుందని.. ముందు తాను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. 
 
చాలా సమయం ఇచ్చానని.. ఆలోచించుకోమన్నానని పృథ్వీ తెలిపాడు. అందుకు ఆమె కుటుంబం కూడా పెళ్లికి ఒప్పుకుంది. అయితే త్వరలోనే శీతల్‌ను వివాహం చేసుకుంటానని.. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నామని.. తనపై నమ్మకం ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments