Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశం శాంతి, సుఖంగా వుందంటే అందుకు ప్రధాని మోదీ కారణం: సినీ నటుడు సుమన్

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (23:07 IST)
ప్రముఖ సినీనటుడు సుమన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుత కష్టపరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి మోడీ అంటూ పొగడ్తలతో కొనియాడారు. ఉక్రెయిన్ విద్యార్థులను చాలా సేఫ్‌గా మన దేశానికి తీసుకురావడంలో ప్రధానమంత్రి చేస్తున్న కృషి చాలా గొప్పదన్నారు.

 
అసలు ఇప్పటికిప్పుడు ఎందుకు సుమన్ ప్రధానమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారో ఎవరికీ అర్థం కాలేదు. అసలు సుమన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. భారతదేశ శాంతి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు మోడీ. నేను బిజెపి మనిషిగా మాట్లాడటం లేదు. 

 
ఏ పార్టీ వారు చేయని విధంగా మోడీ పనిచేస్తున్నారు. రామ మందిరం.. ఆర్టికల్ 370, కాశ్మీర్ అంశం. ఇలా ఒక్కటేమిటి.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా మన దేశానికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం ఇలా ఎన్నో మంచి పనులను చేస్తున్నారు మోడీ. 

 
దేశానికి చెడ్డపేరు వచ్చే పని ఆయన ఎప్పటికీ చేయరని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశం కోసం భారతీయుల కోసం మోడీ చాలా కష్టపడుతున్నారు. మన సైనికులు మనల్ని కాపాడేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగానే మాట్లాడుతాను. 

 
నాకు ముందు ఒక మాట.. వెనుక మరో మాట మాట్లాడటం తెలియదు. ఏదైనా ముక్కుసూటితనంగానే మాట్లాడుతానంటున్నాడు సుమన్. సుమన్ కెసిఆర్, జగన్‌లను పొగడ్తలతో ఎప్పుడూ ముంచెత్తుతుంటారు. అలాంటి వ్యక్తి ప్రధానిని పొగడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments