ఎన్నో విషయాలను నిర్మొహమాటంగా చెప్పే రామ్‌గోపాల్ వర్మ తాజాగా నెల్లూరు ఆయుర్వేద డాక్టర్‌ను జాతీయ సొత్తుగా గుర్తించాలని ఈరోజే ప్రకటించారు. ఇక సాయంత్రానికి మోడీపై చురక వేశాడు వర్మ. ప్రధాని మోడీపై ఫన్నీ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కరోనా కఠిన పరిస్థితుల పై ప్రధాని మోదీ ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన వీడియోని తీసుకున్నాడు. దానికి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డుల ప్రకటనకి సంబంధించిన వీడియోలో ప్రధాని వీడియోని ఎడిట్ చేశాడు. రెండు జతచేసి ట్విట్టర్‌లో పెట్టాడు.
మరి మోడీ అభిమానులు ఊరుకుంటారా. ఏదో కామెంట్ చేస్తూనే వున్నారు. మోదీ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డుకు అర్హులు అనే సెన్స్ వచ్చేలా వర్మ ఇలా ఫన్నీగా వీడియో పోస్ట్ చేయడం బాగాలేదని, దేశంలో కరోనా విజృంభిస్తున్న తీరుకు ప్రజలు భయంతో వణికిపోతుంటే వర్మ ఇలా బాధ్యతారహితంగా మోదీ పై సైటర్లు వేయడంతో మొత్తానికి ఇది హాట్ టాపిక్ అయింది. మరి మోడీ అభిమానులు కోప్పడితే అసలు కరోనా టైంలో ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? కుంభమేళా ఎందుకు జరిపారు? ప్రజల పాణాలకు ఎవరు బాధ్యులు అంటూ దానిపైనా పెడతాడని కామెంట్ చేసినా చేయవచ్చని వర్మ అభిమానులు తెలియజేస్తున్నారు. సో. ఇది ఎంతమేరకు వెళుతుందో చూడాలి.