Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో కూడా ‘దృశ్యం 2’కు స‌న్నాహాలు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:16 IST)
Venky with drusham2 team
వెంక‌టేష్ న‌టించిన `దృశ్యం` సినిమా తెలిసిందే. ఆ సినిమాకు కొన‌సాగింపుగా ఇప్పుడు దృశ్యం2 మ‌ల‌యాళంలో వ‌చ్చింది. శుక్ర‌వారమే ఈ సినిమా ఓటీటీలో విడుద‌లైంది. వెంట‌నే ఈ సినిమా అద్భుతంగా వుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీంతో తెలుగులోకూడా పార్ట్‌2 తీస్తార‌ని టాక్ వ‌చ్చింది. శ‌నివారం నాటికి దృశ్యం2కు సంబంధించిన వివ‌రాల‌ను సురేష్‌బాబు ప్ర‌క‌టించాడు. వెంక‌టేష్‌తో చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు వున్న ఫొటోను పోస్ట్ చేశారు. మలయాళంలో మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో రూపొందిన థ్రిల్లర్‌ మూవీ 'దృశ్యంస‌. తర్వాత ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. శ్రీప్రియ తెరకెక్కించిన తెలుగు 'దృశ్యం'లో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించారు. తెలుగులోనూ 'దృశ్యం' మంచి హిట్‌ను సాధించింది. 
 
తాజాగా మలయాళంలో 'దృశ్యం' సీక్వెల్‌గా రూపొందిన 'దృశ్యం 2' ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటోంది. దాంతో తెలుగులోకూడా రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు.  అందుకే కేర‌ళ‌లో షూటింగ్ నిమిత్తం వున్న వెంకటేష్‌ను 'దృశ్యం 2' డైరెక్టర్‌ జీతూ జోసెఫ్‌, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ప్రత్యేకంగా కలిశారు. సమావేశం అనంతరం నిర్మాత ఆంటోని తెలుగులో దృశ్యం2 రీమేక్‌ కానుందని అధికారికంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. మార్చిలో షూటింగ్‌ను స్టార్ట్‌ చేసి రెండు నెలల్లోనే సినిమాను  విడుద‌ల చేయాల‌నే ప్లాన్ వున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments