Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ పోలీసులకు న‌చ్చిన అల్లు అర్జున్

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:06 IST)
Allu Arjun, polic app
మ‌ల‌యాళంలో అల్లు అర్జున్ సినిమాలంటే క్రేజ్‌. అక్క‌డ ఏదైనా కార్య‌క్ర‌మానికి వెళ్ళినా కేర‌ళ‌లో తండోప‌తండాలుగా యూత్ వ‌స్తుంటారు. ఈ క్రేజ్‌ను వాడుకోవ‌డానికి కేర‌ళ పోలీసు శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వారు `పోల్ యాప్‌` అనే పోలీసు యాప్‌ను వినియోగిస్తున్నారు. అందుకు యూత్‌లో బాగా వెళ్ళాలంటే అల్లు అర్జున్‌ను వినియోగించుకున్నారు. ఎలాగంటే, రేసుగుర్రంలో త‌న కుటుంబానికి ఆప‌ద వచ్చిన‌ప్పుడు ష‌డెన్‌గా పోలీసు బైక్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు అల్లు అర్జున్‌. సేమ్‌టు సేమ్ అలాగే ఓ వీడియోను త‌యారుచేసింది.

కేర‌ళ పోలీసు. ఆ వీడియో ఎలా వుందంటే, ఆ వీడియోలో హీరో కుటుంబం ఓ వాహనంలో చిక్కుకుపోతుంది. దాన్నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటుంది. ఆ వాహనాన్ని ఢీ కొట్టడానికి విలన్‌లు మరో వాహనంలో వస్తుంటారు. అదే సమయంలో పోల్ యాప్‌ను ప్రెస్ చేయగా.. పోలీస్ డ్రెస్‌లో ఉన్న అల్లు అర్జున్ వారికి ఎదురుగా వస్తారు. ఒక్కసారిగా విలన్‌లు హడలిపోయి సడన్ బ్రేక్ వేస్తారు. అలా తన కుటుంబాన్ని హీరో రక్షించుకుంటారు. పోల్ యాప్‌ కిందకు అన్ని శాఖలను అందుబాటులోకి తీసుకు వచ్చామని కేరళ పోలీసులు తెలియ ‌జేస్తున్నారు.  ప్రమాద సమయంలో ఈ యాప్‌ను వినియోగిస్తే, తాము క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుంటామని చెప్పడానికి కేరళ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఇది చూసి మ‌న పోలీసులు కూడా ఏదైనా యాప్ త‌యారుచేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments