Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించొద్దు సెన్సార్ పూర్తి - ఐదు భాషల్లో విడుదలకు సిద్దం

డీవీ
బుధవారం, 8 మే 2024 (17:30 IST)
preminchoddu still
అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా జూన్ 7న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్.
 
చిత్ర దర్శక నిర్మాత షిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతోందనే పాయింట్‌లో ‘ప్రేమించొద్దు’ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న తొలి ఇండిపెండెట్ మూవీ. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 7న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 
నటీనటులు:- అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
 
సాంకేతిక వర్గం: రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ను ఆడకుండా చేయాలని చూస్తున్నారు, నేను చూస్తాను: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments