Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్‌కు మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడా... వైరల్ అవుతున్న రూమర్లు

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (17:22 IST)
దక్షిణాదిలో ఎన్నో భారీ సక్సెస్‌లను స్వంతం చేసుకున్న ప్రముఖ చలనచిత్ర దర్శకుడు గత కొద్దికాలంగా సక్సెస్‌లు లేక డీలాపడిపోయారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తీయడానికి సిద్ధమవుతున్నాడు.


ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందించిన సమాచారం మేరకు ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న క్రమంలో నటీనటులు ఎంపికపై దృష్టిపెట్టారు దర్శకుడు మణిరత్నం. 
 
ఈ సందర్భంలో మణిరత్నంను ప్రేమమ్ హీరోయిన్, మలయాళ ముద్దుగుమ్మ మడొన్నా సెబాస్టియన్ కలవడం వలన ఆమె పొన్నియన్ సెల్వన్‌ చిత్రంలో నటించనున్నారనే వార్త వైరల్‌గా మారింది.

దర్శకుడు మణిరత్నంను కలిసిన తర్వాత మడోన్నా సెబాస్టియన్‌ ఒక సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటుగా ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నేను ఏమీ మాట్లాడలేను కానీ ఈ ఫొటో మాట్లాడుతుంది. నా మనసును, గుండెను అద్భుతమైన సినిమా వెంటాడుతోందంటూ షేర్ చేసారు.
 
కానీ మణిరత్నంను కలవడానికి గల కారణం మాత్రం చెప్పలేదు. మణిరత్నం క్యాంప్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణలు లేకపోయినప్పటికీ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మోహన్ బాబు, అనుష్కశెట్టి, అమలా పాల్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చోళ సామ్రాజ్యపు కథా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments