Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిలియన్ వ్యూస్‌తో ప్రేమదేశం గ్లిమ్స్

Webdunia
శనివారం, 7 మే 2022 (16:14 IST)
Megha Akash, Trigun
1996లో విడుదలై పెద్ద సూపర్ హిట్ సాధించిన" ప్రేమదేశం" సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు దాదాపు దశాబ్దంపాటు ఎక్కడ చూసినా వినపడుతూ ఉండేవి.అప్పట్లో ప్రేమదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉండేది ప్రేమకథల్లో. చాలా కాలం తర్వాత అదే టైటిల్ తో  ఇప్పుడు వస్తున్న  "ప్రేమదేశం' సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన నాటి "ప్రేమదేశం" సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతంతోను అంతే ప్రాణం పోశాడు అని చెప్పాలి.ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం విడుదల చేసిన "ప్రేమదేశం" గ్లిమ్స్ కు  అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.సరిగమప యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్  1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది అంటే ప్రేక్షకులు ఎంత ఆదరిస్తున్నారు అనేది తెలుస్తుంది. అప్పటి సినిమాలాగే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే ఫీల్ ను ప్రేక్షకులలో కలిగిస్తుంది. 
 
ఈ సినిమాలో అలనాటి అందాల తార మధుబాల ఈ చిత్రంలో నటించడం విశేషం. త్రిగున్, మేఘా ఆకాష్, జంటగా నటిస్తున్న ఈ సినిమాను సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తుండగా,దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం యువ ప్యాషనేట్ టీమ్‌తో కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 
కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకొంది .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా   ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తుంది.
నటీనటులు:  మేఘా ఆకాష్, త్రిగున్ , మధుబాల, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు. 
 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments