Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయం చేస్తున్న ప్రకాష్ రాజ్ .. మామిడికాయలు అమ్ముతున్న తనయుడు

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:37 IST)
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విలక్షణ నటుడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడు ఇలా ఏ క్యారెక్టర్లోనైనా జీవించగల నటుడు ప్రకాష్ రాజ్. అలాంటి నటుడు ఇపుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన తనయుడు మామిడి కాయలు విక్రయిస్తున్నాడు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజమండి. 
 
కరోనా వైరస్ దెబ్బకు యావత్ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో తన భార్యా పిల్లలతో సేదతీరుతున్నారు. గత 40 రోజులుగా ఆయన ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. 
 
తాజాగా, ఫాంహౌస్‌లో మామిడి చెట్లకు కాసిన కాయలను కోశారు. ఆ కాయల మధ్య ప్రకాష్ తనయుడు వేదాంత్ రాజ్ కూర్చొన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, దానికింద... మావాడు మామిడి కాయల వ్యాపారి అయ్యాడంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. 
 
నిజానికి ఈ వ్యవసాయ క్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో అన్ని రకాల పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. 
 
సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో ఎంతో క్రూరంగా కనిపించే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సామాజిక స్పృహ కలిగిన, నిజమైన భారతీయుడులా నడుచుకుంటున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన వెయ్యి కుటుంబాలను పోషిస్తూ తనలోని పెద్దమనసును చాటిచెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments