Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్‌షోలో ప్రకాష్ రాజ్ దురుసు ప్రవర్తన : యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆగ్రహం

సినీ నటుడు ప్రకాష్ రాజ్ దురుసుగా ప్రవర్తించాడు. అదీ కూడా ఓ లైవ్ షోలో. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన తన చొక్కాకు అమర్చివున్న మైక్రోఫోన్‌ను విసిరికొట్టి యాంకర్‌పై తన కోప

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:40 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ దురుసుగా ప్రవర్తించాడు. అదీ కూడా ఓ లైవ్ షోలో. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన తన చొక్కాకు అమర్చివున్న మైక్రోఫోన్‌ను విసిరికొట్టి యాంకర్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ గొడవ ఎక్కడ జరిగిందంటే... 
 
తన తాజా చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల కోసం ఓ చానెల్‌కు ప్రకాష్‌ రాజ్ వెళ్లారు. సినిమా విశేషాల గురించి అడుగుతూ వచ్చిన యాంకర్ ఉన్నట్టుండి తమిళనాడు, కర్ణాటకల మధ్య ముసురుకున్న కావేరీ జల వివాదాలపై ప్రశ్న సంధించింది. అడిగింది. దీంతో ప్రకాష్‌ రాజ్‌ సహనం కోల్పోయారు. 
 
‘సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఈ ప్రశ్న అవసరమా? మాట్లాడుకోవడానికి బోలెడు సమస్యలున్నాయి. రైతుల సమస్యల గురించి మాట్లాడొచ్చు. కానీ, కావేరి జల వివాదాల గురించి నా స్పందనను చెప్పించి వివాదం సృష్టించాలనుకుంటున్నారా’ అంటూ మైక్రోఫోన్‌ తీసి విసిరికొట్టాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments