Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

దేవీ
శనివారం, 10 మే 2025 (20:02 IST)
Pradeep Ranganathan look
ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే'తో నటుడిగా అరంగేట్రం చేశారు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ 'డ్రాగన్' తో మ్యాసీవ్ పాపులరిటీ సాదించారు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు.

పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో  డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. 'ప్రేమలు' చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
 
ఈరోజు ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్ గా విడుదల చేశారు, అద్భుతమైన ఫస్ట్ లుక్‌ను రివిల్ చేయడంతో పాటు, విడుదల తేదీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. యూత్ ని ఆకట్టుకునే విధంగా 'డ్యూడ్' అనే టైటిల్ తో రూపొందిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్ లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూచించినట్లుగా, డ్యూడ్ మోడరన్ ట్విస్ట్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం 2025 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
 
ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళికి సరైన ఎంటర్టైనర్ ను అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. డ్యూడ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments