Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

దేవీ
శనివారం, 5 ఏప్రియల్ 2025 (17:17 IST)
Pradeep Machiraju, Deepika Pilli
టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. వేసవిలో ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  
 
ఈ రోజు మేకర్స్ ప్రియమార సాంగ్ రిలీజ్ చేశారు. రధన్ సాంగ్ లవ్లీ మెలోడీ  కంపోజ్ చేశారు. రాకేందు మౌలి  రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. శరత్ సంతోష్, లిప్సిక భాష్యం వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ లవ్లీగా వుంది.  ప్రదీప్ తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తోంది.
 
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.
 
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ససోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments