Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Advertiesment
Nitin-Rabinhood

దేవీ

, శుక్రవారం, 28 మార్చి 2025 (17:15 IST)
Nitin-Rabinhood
నటీనటులు : నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్ చాకో, లాల్ తదితరులు.
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్, సంగీతం : జీవి ప్రకాష్, ఎడిటర్ : కోటి, దర్శకుడు : వెంకీ కుడుముల, మైత్రి మూవీ మేకర్స్
 
నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం “రాబిన్ హుడ్”. ఇందులో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా తీసుకుని హైప్ క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు. గతంలో నితిన్ సినిమాలో బ్యాడ్మెంటన్ క్రీడాకారిణి జ్వాలా గుప్త చేత నటింప జేశారు. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
అనాథ పిల్లవాడిగా ఆశ్రమంలో వుండే రామ్ (నితిన్) ఆకలి కారణంగా  తోటి అనాథలు పడుతున్న దుస్థితిని చూసి చలించిపోతాడు. తన తెలివితేటలతో ధనవంతుల నుండి డబ్బును దొంగిలించి పేదలకు పంచుతాడు. అయితే రామ్ ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో)కు ఎత్తు వేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు రామ్. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ సెక్యూరిటీ కంపెనీలో రామ్ జేరతాడు? ఇంకోపక్క రుద్రకొండ అనే గ్రామపు నేలలో సాగు చేసే గంజాయికి డిమాండ్ ఉందని తెలుసుకున్న సామి (దేవదత్త నాగే) కన్నేస్తాడు. ఇంతలో, వాసుదేవ్ కుమార్తె రీనా వాసుదేవ్ (శ్రీలీల) రుద్రకొండకు వస్తుంది. ఆమె ఎందుకు వచ్చింది? ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అభినవ వాసుదేవ్ (సిజ్జు) తన ఏవి ఫార్మా అధినేతకు ఉన్న లింక్ ఏంటి? నీరాతో రామ్ ప్రేమలో ఎలా పడ్డాడు? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్రకు లింకేమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఇందులో రాజేంద్రప్రసాద్, రామ్ పాత్రల మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. దర్శకుడు వెంకీ కుడుముల తన ట్రేడ్‌మార్క్ వినోదంతో ఎంటర్ టైన్ చేయించాడు. ఈ సినిమాలోనూ తన గత చిత్రాల జోరును కొనసాగిస్తున్నాడు. భావోద్వేగాలను, హాస్యాన్ని బేలన్స్ చేసుకునేలా కథనాన్ని నడిపాడు. రచనలో హాస్య సమయం చాలా బాగుంది. నటనాపరంగా అందరూ బాగా సరితూగారు.
 
నితిన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలలో అతను స్టైలిష్ గా కనిపిస్తాడు. దానికితోడు  టైమింగ్ తో భావోద్వేగాలు చక్కగా ఆవిష్కరించాడు. నితిన్, రాజేంద్ర ప్రసాద్, శ్రీలీలతో కెమిస్ట్రీ ఎంటర్ టైన్ చేస్తుంది. శ్రీలీల తన పాత్రను బాగా పోషించింది. విలన్ దేవదత్త నాగే విలన్ పాత్ర ఆయన పోషించిన తీరు ఆకట్టుకుంటుంది. శుభలేక సుధాకర్, లాల్ వంటి ఇతర సహాయ నటులు అద్భుతమైన భావోద్వేగ ప్రదర్శనలు ఇచ్చారు. వెన్నెల కిషోర్ హాస్య సన్నివేశాలు బాగా పేలాయి. ఇక ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ లైటర్ వేలో తన నటనను ప్రదర్శించాడు.  
 
అయితే, ఇలాంటి కథలు కత్తిమీద సామే. రాబిన్ హుడ్ అంటేనే ఉన్నవారిని దోచుకుని లేనివాడికి పెట్టడం. అందులో లాజిక్ కంటే మేజిక్ ముఖ్యం. ఆ క్రమంలో నిమా బాగుంది, కానీ ఇంకాస్త ఆసక్తికరంగా, ఆసక్తికరంగా చిత్రీకరించాల్సింది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా, హాస్యాస్పదంగా వున్నా, కథ సాగుతున్న కొద్దీ వేగం తగ్గిపోతుంది. రెండో భాగాన్ని మరింత ఆసక్తిగా తీయాల్సి వుంది. ప్రారంభంలో బలమైన పాత్రగా చూపించబడిన విలన్, క్లైమాక్స్ వైపు బలహీనంగా చూపించాడు, ఇది నిరాశపరిచేలా అనిపిస్తుంది. అందువల్లే మొదటి భాగంలో వున్న జోరు రెండవ భాగంలో కనిపించదు. సినిమాలోని రెండు పాటలు ఆహ్లాదకరంగా ఉన్నాయి, కానీ అవి కథ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తున్నట్లు అనిపిస్తుంది.
 
రాబిన్‌హుడ్‌లో నిర్మాణ విలువలు బాగున్నాయి, అయితే కొన్ని సందర్భాలలో VFX పని తడబడుతుంది. ఒక సందర్భంలో, నితిన్ ముఖంపై రక్తపు మరక గమనించదగ్గ విధంగా కృత్రిమంగా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న వివరాలను ఇంకా బాగా హ్యాండిల్ సరిగా చేయాల్సింది. G. V. ప్రకాష్ సంగీతం, సినిమాటోగ్రఫీ టోన్‌ను కథకు అనుగుణంగా వుంది. ఎడిటింగ్ లో చిన్నపాటి లోపాలున్నాయి. 
 
మొత్తంగా చూస్తే, రాబిన్‌హుడ్ ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన ఎంటర్‌టైనర్, ఇది వినోదం, భావోద్వేగాలను అందిస్తుంది. వెంకీ కుడుముల సిగ్నేచర్ హాస్యం, సెంటిమెంట్ తో రూపొందింది.కథను మరింత గ్రిప్పింగ్ గా పెడితే సినిమా మరో లెవల్లో వుండేది. అయినప్పటికీ, రాబిన్‌హుడ్ ఇప్పటికీ సరదాగా, టైమ్-పాస్ వారికి మంచి వారాంతపు వినోదంగా నిలుస్తుంది.
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ