Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-3కి రాజమౌళి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.. ప్రభాస్

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (17:10 IST)
బాహుబలి సిరీస్ రికార్డుల పంట పండించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్‌ వైపు తిరిగి చూసేలా చేశాడు. బాహుబలికి ఇప్పటికే పార్ట్-1, పార్ట్ 2లు వచ్చిన నేపథ్యంలో.. బాహుబలి 3 గురించి ఆలోచించేది లేదని రాజమౌళి చెప్పేశారు. అయితే ''సాహో'' ప్రమోషన్‌లో భాగంగా బాహుబలి హీరో ప్రభాస్ మాత్రం బాహుబలి 3 గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. 
 
భవిష్యత్తులో బాహుబలి 3 తీసే ఆలోచనలో రాజమౌళి వున్నాడని.. ఇందుకోసం కొన్ని స్కిప్టుల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాడని ప్రభాస్ చెప్పాడు. కానీ ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కుతుందో తెలియదని, అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ బాహుబలి 3 తొలి రెండు భాగాలకు పూర్తిగా విభిన్నంగా వుంటుందని.. కొత్త కథతో తెరకెక్కుతుందని ప్రభాస్ తెలిపాడు.
 
ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 3 గురించి మాట్లాడేందుకు కారణం లేకపోలేదని.. ఇప్పటికే ప్రభాస్-అనుష్కల మధ్య ప్రేమాయణానికి బాహుబలి సినిమానే కారణమైంది. ఈ సినిమాకు తర్వాత అనుష్కతో పెళ్లెప్పుడని ప్రభాస్‌ని అడిగే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రభాస్ మాత్రం ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని చెప్తూ వస్తున్నాడు. 
 
అయినప్పటికీ అనుష్కతో ప్రేమ గురించి మీడియా ప్రతినిధుల నుంచి వచ్చే ప్రశ్నలకు బ్రేక్ వేసేందుకే ప్రభాస్.. బాహుబలి 3 గురించి నోరు విప్పాడని టాక్ వస్తోంది. మరి బాహుబలి 3 గురించి ట్రిపుల్ ఆర్‌‌లో బిజీగా వున్న జక్కన్న ఏం సమాధానమిస్తాడో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments