Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికను ఉద్దేశించి కేజీఎఫ్ యాష్ అలాంటి కామెంట్స్ చేశాడా?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (16:42 IST)
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ హీరోయిన్ రష్మిక మందనపై కన్నడిగులు గుర్రుగా వున్నారు. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్‌లో తనకు కన్నడ సరిగా రాదంటూ రష్మిక చేసిన కామెంట్సే ఇందుకు కారణం. రష్మిక మాట్లాడిన తీరు కన్నడ ప్రేక్షకుల కోపానికి దారితీసింది. ఇందులో భాగంగా ఆమెను కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వెలివేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. 
 
తాజాగా కేజీఎఫ్ స్టార్ హీరో యాష్ కూడా కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందనను ఉద్దేశించి కామెంట్లు చేశాడు. తాజాగా ఓ ఆడియో వేడుకలో పాల్గొన్న యాష్.. కిస్ సినిమాలో నటించిన శ్రీలీలాపై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీలీలా కన్నడలోనే కాదు మిగతా భాషలల్లో సినిమాలు చేయాలని అన్నాడు. 

అయితే ఎక్కడకి వెళ్లినా మూలాలను మాత్రం మరచిపోవద్దని హితవు పలికారు. కేజీఎఫ్ స్టార్ చేసిన కామెంట్స్ రష్మికను ఉద్దేశించే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
 
కన్నడం కంటే అధిక పారితోషికం ఇస్తున్నారని కోలీవుడ్, టాలీవుడ్‌కి వచ్చిన రష్మికపై ఇప్పటికే ఫ్యాన్స్ కోపంతో వున్నారు. కానీ డియర్ కామ్రేడ్ ప్రమోషన్‌లో కన్నడ భాష అంతగా రాదని చెప్పిన వ్యాఖ్యలు ఆమెపై విమర్శలొచ్చేలా చేశాయి. అయితే తను ఏ భాషలో చేసినా కన్నడ పరిశ్రమ తనకు స్పెషల్ అంటూ ఎప్పుడు రష్మిక చెబుతూ వస్తుంది. 
 
మరి తాజాగా యాష్ రష్మికను ఉద్దేశించి అలా మాట్లాడాడా? లేకుంటే రష్మికలా ఎవ్వరూ మాట్లాడకూడదని అలా అన్నాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యాష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వ్యవహారానికి రష్మిక ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments