స్విగ్గీని ఏకిపారేసిన ప్రభాస్ సోదరి ప్రసీద.. స్విగ్గీని ఇకపై వాడేది లేదు

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (20:41 IST)
prabhas_Sister
రెబల్ స్టార్ ప్రభాస్ సోదరి ప్రసీద రాధేశ్యామ్ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే తాజాగా ప్రసీదకు చేదు అనుభవం ఎదురైంది.
 
ప్రసీద సోషల్ మీడియా వేదికగా స్విగ్గీ సేవలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. స్విగ్గీ వాళ్ల నుంచి తనకు చేదు అనుభవం ఎదురైందని స్పష్టం చేశారు. స్విగ్గీ నుంచి క్వాలిటీ లేని ఆహారం డెలివరీ కాగా ఫిర్యాదు చేస్తే వాళ్లు చేతులెత్తేశారని ఫిర్యాదు చేశారు. 
 
ఆలస్యంగా డెలివరీ చేస్తున్నారని క్వాలిటీ ఫుడ్ అందించలేదని ప్రసీద కామెంట్లు చేశారు. స్విగ్గీ చెత్త సర్వీస్ అందిస్తోందని ఆ యాప్ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని ఆమె కామెంట్ చేశారు.
 
తాను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే వాళ్లు చేసిన తప్పులకు మమ్మల్ని నిందించడం వల్ల తనకు ఫ్రస్టేషన్ పెరుగుతోందని ఆమె కామెంట్లు చేశారు. 
 
ఇకపై తాను స్విగ్గీని వాడనని స్విగ్గీ కంటే మెరుగైన సేవలు అందిస్తున్న యాప్స్ ఉన్నందుకు హ్యాపీగా వుందని ప్రసీద చెప్పారు. ప్రసీద చేసిన కామెంట్ల గురించి స్విగ్గీ స్పందించింది.
 
ఆర్డర్ ఐడీని పంపించాలని ప్రసీదకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని స్విగ్గీ తెలిపింది. సమస్యను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధులు పోస్ట్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments