రాధేశ్యామ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రభాస్ సోదరి ఎంట్రీ

Webdunia
శనివారం, 11 జులై 2020 (15:24 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలామంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శక నిర్మాతలుగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి మరొకరు అడుగుపెడుతున్నారు. వారు ఎవరోకాదు.. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ నిర్మాణంలో ఆమె పాలుపంచుకుంటూ.. ఈ సినిమాకు నిర్మాతగా అడుగు పెట్టనున్నారు.
 
రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్‌తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. సినిమాతో పాటు ఓటీటీ ప్లాట్పార్మ్సకు సినిమాలను, వెబ్ సీరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఆమె అన్నయ్య, హీరో ప్రభాస్‌కు పూర్తి సహకారం అందిస్తున్నా రట.
 
ఇప్పటికే కృష్ణంరాజు నటవారసుడిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్పెక్ట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేమ్ కె.రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నారు.
 
తాజాగా నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. యువి బ్యానర్‌తో కలిసి గోపి కృష్ణ బ్యానర్ పైన కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. భారీ బట్జెట్టుతో తయారయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments