ప్రభాస్ - పూజా 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (10:51 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరి 'రాధే శ్యామ్'. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రం 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు.
 
ఈ చిత్రం ఎపుడు విడుదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. 2018లోనే అధికారికంగా ప్రకటించిన 'రాధే శ్యామ్' అనేక కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. 
 
ఆఖరి దశకు చేరుకునేసరికి కరోనా ప్రభావం పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో బ్యాలెన్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించిన మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశారు. 
 
ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వనున్నట్టు వెల్లడించిన 'రాధే శ్యామ్' బృందం అన్నట్టుగానే ట్విట్టర్ వేదికగా ఈ చిత్రాన్ని 2022 జనవరి 14న మకర సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. 
 
ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ - రానా మల్టీస్టారర్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట దిగబోతున్నట్టు ప్రకటించగా ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రం 'రాధే శ్యామ్'ని దింపుతున్నట్టు ప్రకటించాడు. సో, 2022 సంక్రాంతికి పలువురు అగ్రహీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments