Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ హారర్ జానర్ లో ప్రభాస్, రాజా సాబ్ గ్లింప్స్

డీవీ
సోమవారం, 29 జులై 2024 (19:30 IST)
Raja Saab
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ మూవీ "రాజా సాబ్" ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు. "రాజా సాబ్" సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు.

"రాజా సాబ్" సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ కు కేరాఫ్ గా మారిన ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. "రాజా సాబ్" సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments