Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ రాధేశ్యామ్ టీజ‌ర్ డేట్ ఫిక్స్‌

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:22 IST)
Prabhas, Radhesyam, teaser, poster
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్లున్న‌ ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. ఈ చిత్రం కొత్త డిటైల్స్‌ను చిత్ర‌యూనిట్ శ‌నివారంనాడు ఉద‌యం ప్ర‌క‌టించింది. ప్ర‌భాస్ ల‌వ్‌స్టోరీకి త‌గిన‌ట్లే టీజ‌ర్‌ను ఈనెల 14న అంటే ప్రేమికుల దినోత్స‌వంనాడు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాధా కృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి. క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మ‌స్తోంది. ఇంతకుముందు రాధాశ్యామ్ గురించి స్టిల్్స‌ను విడుద‌ల చేశారు. అవి మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.

కాగా, ఈరోజు ప్ర‌భాస్ సోలో స్టిల్‌ను విడుద‌ల చేశారు. కాగా, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన బాణీలు చిత్రానికి వ‌న్నె తెస్తాయ‌ని యూనిట్ చెబుతోంది.  భారీ బడ్జెట్ తో రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. 
 
ప్రేమికుల దినోత్సవం నాడు ప్రభాస్ ఫ్యాన్స్‌ను బి రెడీ అంటూ యువి క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇందుకోసం అంద‌రికీ న‌చ్చేవిధంగా వీడియోను డిజైన్ చేశారు. ఆ వీడియోలో బాహుబ‌లి నుంచి రాధేశ్యామ్ వ‌ర‌కు సోలో మోష‌న్ పోస్ట‌ర్‌ను చూపించారు. ఇప్ప‌టివ‌ర‌కు మాస్ పాత్ర‌లు చేసిన ప్ర‌భాస్ ఇందులో ప్రేమ కోణాన్ని కూడా చూస్తారంటూ యూనిట్ చెబుతోంది. మ‌రి టీజ‌ర్ ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments