Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఆవిష్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 10 జనవరి 2024 (18:27 IST)
The Goat Life look
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

ఏప్రిల్ 10న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు, "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) మూవీ టీమ్ కు ప్రభాస్ తన బెస్ట్ విశెస్ తెలియజేశారు.
 
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. ఐదేళ్లు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)  సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్ లోనూ ప్రేక్షకులు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతారు. అని చెప్పారు.
 
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు.  ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.
నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి వివాదం.. హైదరాబాద్‌లో తల్లీ కుమార్తెను గదిలో బంధించి గోడ కట్టేశారు.. ఎక్కడ?

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?

పూరిగుడిసెలో కూర్చొని పెన్షన్ డబ్బులు పంపణీ చేసిన సీఎం చంద్రబాబు (Video)

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments