సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన విడుదలకు సిద్ధమైంది

డీవీ
బుధవారం, 10 జనవరి 2024 (17:20 IST)
Sandeep Kishan, Kavya Thapar, Varsha Bollamma
హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’.హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
 
ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.
 
ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వుండబోతుంది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
 
వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments