రాధే శ్యామ్ జాత‌కాన్ని చెప్ప‌లేక‌పోయిన‌ ప్ర‌భాస్!

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:02 IST)
Prabhas
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప‌లు చోట్ల మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన చిత్ర టీమ్ నేడు హైద‌రాబాద్‌లోనూ స్టార్ హోట‌ల్‌లో ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ రాధే శ్యామ్ గురించి ద‌ర్శ‌కుడు, ఆర్ట్ డైరెక్ట‌ర్‌, థ‌మ‌న్ సంగీతం గురించి ఆహా! ఓహో\! అనేలా మాట్లాడాడు. రొటీన్‌గా వివిధ చోట్ల మాట్లాడిన వివ‌రాలే తెలియ‌జేశాడు. కానీ కొత్త‌గా ఆయ‌న‌కు ఎదురయిన స‌మ‌స్య ఆంధ్ర ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం సినిటికెట్ల రేట్ల గురించి, అస‌లు జ‌గ‌న్ మీతో ఎటువంటి హామీ ఇచ్చాడ‌నేది ప్ర‌ధాన అంశంగా వుంది.
 
వీటిపై ప్ర‌భాస్ ఆ విష‌యాల‌న్నీ మా నిర్మాత వంశీనే చూసుకుంటాడంటూ దాట వేశారు. కానీ విలేక‌రులు ఊరుకోలేదు. మీరు కూడా జ‌గ‌న్‌ను క‌లిశారు క‌దా? అని అడిగితే.. అంతా మంచి జరగాలనే కోరుకుంటున్నాం.. వస్తే బావుంటుంది అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ట్విస్ట్ ఏమంటే రాధే శ్యామ్ క‌థ జాత‌కాలు చెప్పే జ్యోతిష్యుడి క‌థ‌. మ‌రి ప్ర‌భాస్ త‌న రాధేశ్యామ్ జ్యోతిష్యం గురించి ఏమి జ‌రుగుతుందో కూడా తెలీయ‌కుండా చెప్పాడ‌ని అక్క‌డివారు సెటైర్లు వేసుకోవ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments