Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెట్ స్పీడ్ వేగంతో 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (14:15 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావ‌డానికి కొన్నేళ్లు పడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఈ చిత్రం షూటింగ్‌ను కేవ‌లం 103 రోజుల‌లో పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేలా చేశారు.
 
'ఆదిపురుష్‌ షూట్‌ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను' అంటూ ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 
 
అయితే, ప్రభాస్‌తో ఇంత వేగంగా ఒక సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన నెటిజ‌న్స్ అంతే స్పీడ్‌గా మూవీ అప్‌డేట్స్ కూడా ఇవ్వండ‌ని అంటున్నారు. 'ఆదిపురుష్' చిత్రం రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్ ఆయ‌న‌కు జోడీగా సీత పాత్రలో నటి కృతిసనన్‌ సందడి చేయనున్నారు. 
 
రామాయణంలో ముఖ్యంగా చెప్పుకునే లంకేశుడి పాత్రను బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడి పాత్రను సన్నీసింగ్‌ పోషించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే యేడాది ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments