Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సాహో రిలీజ్ డేట్ ఫిక్స్..!

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (19:53 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం సాహో. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 250 కోట్ల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బాహుబలి చారిత్రాత్మ‌క విజ‌యం తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావ‌డంతో సాహో సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ప్ర‌భాస్‌కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అదే స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలై ఈ సినిమా మేకింగ్‌ వీడియోకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
 
ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సాహో రిలీజ్ ఎప్పుడు అనే దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి కానీ.. చిత్ర యూనిట్ మాత్రం అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి.. బాహుబ‌లితో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌భాస్ సాహో సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments