Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం.. కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (22:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మికంగా మృతి చెందారు. దాదాపు 1500కు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్‌ మాస్టర్‌ మృతితో తెలుగు చలన చిత్ర దాపరిశ్రమలో విషాదం నెలకొంది. అగ్ర కథానాయకుల నుంచి యంగ్‌ హీరోల చిత్రాలకు పనిచేసిన ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు సంతాపం ప్రకటించారు. 
 
సికింద్రాబాద్‌‍లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన రక్త విరోచనాలతో బాధపడ్డారు. ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు ప్రయత్నాలు ఫలించలేదు. రాకేశ్ మాస్టర్ సినీ కొరియోగ్రఫర్‌గా కొన్ని వందల చిత్రాలకు పని చేశారు. ప్రస్తుతం అగ్రశేణి కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్... రాకేశ్ మాస్టర్ శిష్యుడే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్‌చల్.. కారు నుంచి దిగకుండా పూజలు (video)

సెలూన్ ముసుగులో వ్యభిచారం, బ్యాంక్ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ ( video)

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం.. ఏంటది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments