వర్మ గారూ.. మీ క్యారెక్టర్ ఏంటో ఆ సినిమాలో చూపిస్తారా?: పూనమ్ కౌర్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (17:07 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలన బయోపిక్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘పవర్‌ స్టార్‌’ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ''బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు'' అని పేర్కొన్నాడు. 
 
ఇక ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల కాబోతున్న తన తదుపరి చిత్రం టైటిల్ 'పవర్ స్టార్' అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై ప్రముఖులు నోరెళ్లబెడుతున్నారు. ఈ చిత్రంలో పీకే, ఎంఎస్, ఎన్బీ, టీఎస్, ఒక రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది దున్నపోతులు ఉంటాయని వర్మ తెలపడంపై సినీ నటి పూనంకౌర్ మండిపడింది.
 
ఈ సినిమాలో ఆర్జీవీ క్యారెక్టర్‌ను కూడా పెట్టాలని సూచించింది. అమ్మాయిల బలహీనతలను తెలుసుకుని, వారిని రెచ్చగొట్టడం వర్మ క్యారెక్టర్ అని ఫైర్ అయ్యింది. ఇంకా రెచ్చగొట్టి అమ్మాయిల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం వంటి పనులను చేసే వాడి పాత్రను కూడా పెట్టాలని వర్మను ఏకేసింది. వర్మను తాను చిన్నప్పుడు ఎంతో అభిమానించేదాన్నని... కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపింది.
 
ఇకపోతే.. ప్రస్తుత కరోనా సమయంలో రామ్ గోపాల్ వర్మ ఆన్‌లైన్ ద్వారా వరుసపెట్టి సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ''ఆర్జీవీ వరల్డ్ థియేటర్'' పేరిట ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం అనే రెండు సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు పవర్ స్టార్ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ లుక్ కూడా విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం