Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్... కౌశల్ - దీప్తిల మధ్య బాండింగ్స్ గురించి చర్చ

బిగ్ బాస్ హౌస్‌లో ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ రిలాక్స్‌డ్‌గా కనిపించారు. సామ్రాట్, తనీష్, గీతా, దీప్తి, కౌషల్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. ఐదుగురు ఫినాలే కంటెస్టెంట్స్‌కు డబ్బులతో

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:42 IST)
బిగ్ బాస్ హౌస్‌లో ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ రిలాక్స్‌డ్‌గా కనిపించారు. సామ్రాట్, తనీష్, గీతా, దీప్తి, కౌషల్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. ఐదుగురు ఫినాలే కంటెస్టెంట్స్‌కు డబ్బులతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బాస్. సరదాగా జోకులు వేసుకుంటున్నప్పటికీ చివరిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌తో సీరియస్ వాతావరణం నెలకొంది. 
 
కౌశల్ - దీప్తిల మధ్య బాండింగ్స్ గురించి ఎప్పట్లాగే డిస్కషన్ జరుగుతుండగా బిగ్ బాస్ నుండి టాస్క్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఫినాలేలో మీతో పాటు పోటీగా ఎవరు ఉండాలనుకుంటున్నారు...ఎవరు ఉండకూడదనుకుంటున్నారో తెలియజేస్తూ..బోర్డ్‌పై ఉన్న ఫోటోల పక్కన హార్ట్ సింబల్, డిస్‌లైక్ సింబల్ పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. 
 
తనీష్... సామ్రాట్ ఫైనల్‌‌లో తనతో పాటు ఉండాలని, కౌశల్‌ ఫైనల్‌లో ఉండకూడదని సింబల్స్ ఇచ్చారు. దీప్తి నల్లమోతు మాట్లాడుతూ... గీతా మాధురిని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నానని, ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్‌తో ఒంటరి చేస్తున్నామని ఆరోపిస్తూనే ఉంటారని కౌషల్‌ను వద్దని చెప్పారు. 
 
గీతా మాధురి... తనతో పాటు దీప్తి నల్లమోతు ఫైనల్‌లో ఉండాలన్నారు. కౌశల్‌తో తాము ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా కావాలనే ఆ ఫీలింగ్ కలిగిస్తున్నారని, అందుకే ఫైనల్‌లో ఉండకూడదనుకుంటున్నాని చెప్పారు. 
 
సామ్రాట్ మాట్లాడుతూ.. తనీష్ తనతో ఫైనల్‌లో ఉండాలన్నారు. ఫైనల్‌లో కౌషల్‌ను తనతో పాటు ఉండకూదడని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక ఫైనల్‌గా కౌశల్ మాట్లాడుతూ.. నాతో పాటు గీతా మాధురి ఉండొచ్చనుకుంటున్నానన్నారు. అందరిలో సామ్రాట్ వీక్ కంటెస్టెంట్ కాబట్టి అతన్ని ఫైనల్‌లో చూడాలనుకోవడం లేదన్నారు. 
 
ఈ టాస్క్ ముగియగానే హౌస్‌లో ‘నన్ను దోచుకుందువటే’ హీరోహీరోయిన్లు సుధీర్ బాబు, నభా నతేష్‌లు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. సినిమా ముచ్చట్లు, సరదా సరదా టాస్క్‌లతో హౌస్ అంతా పాజిటివ్ ఎనర్జీ నింపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: పబ్‌లో 30 ఏళ్ల మహిళపై మాజీ ప్రేమికుడి దాడి.. ఏమైంది..?

హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు-11మంది అరెస్ట్

ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments