Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వెండితెరపై ఘంటసాల బయోపిక్

ఆయన మరణించి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ, ఆయన గానామృతం మాత్రం ఇప్పటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది. భక్తి గీతాలు, యుగళ గీతాలు, విషాద గీతాలు.. ఇలా అన్ని రకాల పాటలను ఆయన తన స్వరంలో అద్భుతంగా పలికించార

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (09:37 IST)
ఆయన మరణించి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ, ఆయన గానామృతం మాత్రం ఇప్పటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది. భక్తి గీతాలు, యుగళ గీతాలు, విషాద గీతాలు.. ఇలా అన్ని రకాల పాటలను ఆయన తన స్వరంలో అద్భుతంగా పలికించారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. స్వర మాంత్రికుడు ఘంటసాల వెంకటేశ్వర రావు. సంగీత ప్రపంచాన్ని ఊలలాడించిన ఆయన జీవిత చరిత్ర ఇపుడు దృశ్యకావ్యంగా రానుంది.
 
నిజానికి ప్రతి జీవితం వెనుక ఓ కఠోర కష్టాలున్నట్లే ఘంటసాల జీవితంలో కూడా కష్టనష్టాలు ఎన్నో ఉన్నాయి. కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో జోలె పట్టి ఇంటింటికీ తిరిగి ఆహారాన్నిఅడుక్కుని ఆరగించారు. పొట్టకూటి కోసం ఘంటసాల పడిన ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఈ స్థితి నుంచి సంగీత రంగంలో రారాజుగా వెలిగిన అతని జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 
 
ఘంటసాల పాత్రలో ఇమిడిపోయేలా ఉండే నటుడు కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో పాతతరానికి చెందిన అనేక నటీనటుల పాత్రల్లో నేటితరం హీరోలు, హీరోయిన్లు కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం కావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments