Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో శిల్పాశెట్టికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు : ముంబై పోలీసులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:09 IST)
తన భర్త రాజ్‌కుంద్రా చేసిన పాడుపనికి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో శిల్పా శెట్టి వద్ద కూడా పోలీసులు విచారణ జరిపారు. ఈ ఫోర్నోగ్రఫీ కేసులో ఇప్ప‌టికే కుంద్రాను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ప‌లు వివ‌రాలు రాబట్టారు.
 
మరోవైపు శిల్పాశెట్టికి ఈ కేసుతో ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌పై పోలీసులు స్పందించారు. కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం తాము కుంద్రాకు చెందిన వియాన్ ఇండ‌స్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు.  
 
వియాన్ ప‌రిశ్ర‌మే పోర్న్ రాకెట్‌లో కీల‌కంగా ఉంది. దానికి శిల్పా శెట్టి డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శిల్పాశెట్టి అకౌంట్లోకి మాత్రం డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కుంద్రా అకౌంట్లోకి మాత్రం 1.17 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్లు ఆడిట‌ర్స్ గుర్తించారు.
 
మ‌రోవైపు, రాజ్‌కుంద్రా పోర్నోగ్ర‌ఫీ వ్య‌వ‌హారంలో మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న కంపెనీకి చెందిన న‌లుగురు నిర్మాత‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. సినీ న‌టి గెహ‌నా వ‌శిష్ట పేరును కూడా చేర్చిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం