Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందులో హీరోయిన్‌ కాదు కానీ.. కీలక పాత్ర!

హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని తెలుస్తోంది. కథలోభాగంగా కీలక పాత్ర అని.. సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అటువంటి పాత్ర రావడం చాలా అదృష్టమని చెపుత

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:46 IST)
హీరోయిన్‌ తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'ఘాజి'. ఇందులో ఆమెది హీరోయిన్‌ పాత్రకాదని తెలుస్తోంది. కథలోభాగంగా కీలక పాత్ర అని.. సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అటువంటి పాత్ర రావడం చాలా అదృష్టమని చెపుతోంది. అందరూ తనను హీరోయిన్నా అని అడుగుతున్నారు. ఇది కమర్షియల్‌ సినిమాకాదు.. చరిత్రకు సంబంధించిన కథ. కాబట్టి తనది ప్రత్యేకమైన పాత్రని చెబుతోంది. ఈమధ్య అనుకున్నంతగా పేరు రాలేదనేందుకు సమాధానమిస్తూ... గ్లామర్‌ పాత్రల్లో నటిస్తేనే పేరు వస్తుందనుకుంటే అది పేరుకాదు.. పెర్‌ఫార్మెన్స్‌కు తగ్గ పాత్రకు వచ్చిన పేరే కావాలని చెబుతోంది. 
 
తెలుగుకన్నా తమిళ, హిందీ పరిశ్రమలపై దృష్టి పెట్టి మంచి విజయాలందుకుంది. వరుసగా బాలీవుడ్‌‌లో పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మోస్ట్‌‌వాంటెండ్‌ హీరోయిన్‌ అనే పేరు కూడా తెచ్చుకుంది. కాగా, ఘాజీలో బంగ్లాదేశ్‌ శరణార్థిగా నటించింది. ఇది ఖచ్చితంగా తనకు రీ ఎంట్రీ అవుతుందని గట్టిగా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పాత్ర కోసం బెంగాలి నేర్చుకుని నటించినట్లు చెబుతోంది. ఈనెల 17న విడుదలకానున్న ఈ చిత్రం ఎంతటి క్రేజ్‌ తెస్తుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

తర్వాతి కథనం
Show comments