Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబును కలిసిన డెహ్రాడూన్ సీఎం.. ఎందుకు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ మీసకట్టు, గెడ్డంతో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (16:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ మీసకట్టు, గెడ్డంతో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా మహేష్ బాబును ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. కాసేపు ప్రిన్స్‌తో రావత్ ముచ్చటించారు. అయితే, మర్యాదపూర్వకంగానే మహేష్‌తో ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ''భరత్ అనే నేను'' సినిమా గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. 
 
కాగా బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి భారీ డిజాస్టర్లతో సతమతమైన ప్రిన్స్ భరత్ అనే నేను సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ కావడంతో ఫుల్‌జోష్‌లో వున్న మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్‌లో 25వ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. డెహ్రాడూన్‌లోని కళాశాల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరణ ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో మహేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ వచ్చాడని తెలుసుకున్న త్రివేంద్ర సింగ్ సెట్స్‌కు వెళ్లి మహేష్‌ని, చిత్ర యూనిట్‌ని కలిశారు. మహేష్‌తో త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments