Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనురాగ్ కశ్యప్‌పై అత్యాచారం కేసు.. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదట!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:29 IST)
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 19న పాయల్ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కశ్యప్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రిని సైతం ఆమె ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. 
 
తాజాగా అనురాగ్ కశ్యప్‌‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించిన ప్రముఖ నటి పాయల్ ఘోష్ ప్రస్తుతం అత్యాచారం కేసు పెట్టారు. ఈ మేరకు వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది నితిన్ సాత్పూట్ వెల్లడించారు.
 
నిందితుడిపై ఎట్టకేలకు కేసు నమోదైందని చెప్పారు. అత్యాచారం, దురుద్దేశంతో మహిళను నిర్బంధించి వారి గౌరవానికి భంగం కలిగించడంపై ఐపీసీలోని 376(1), 354, 341, 342 సహా పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ దాఖలైందని అని న్యాయవాది ట్వీట్ చేశారు.
 
కాగా తనపై పాయల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ పేర్కొన్నారు. ఈ విషయంలో మౌనంగా ఉండాలని తన న్యాయవాది సలహా ఇచ్చినట్టు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం