Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వకీల్ సాబ్‌'గా పవన్ కళ్యాణ్.. టైటిల్ ఖరారు

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (13:17 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం పింక్. ఇది బాలీవుడ్ చిత్రానికి పింక్‌కు రిమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. కథాపరంగా ఈ సినిమాకి ముందుగా 'లాయర్ సాబ్' అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ, 'వకీల్ సాబ్'అనే టైటిల్ తెరపైకి వచ్చింది. రీసెంట్‌గా ఈ టైటిల్‌నే ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. 
 
దీంతో ఈ చిత్రానికి టైటిల్ వకీల్ సాబ్ అని ఖరారైనట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, ఈ టైటిల్‌ను 'ఉగాది' రోజున అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మే 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో 'గబ్బర్ సింగ్' మే నెలలోనే విడుదలై సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments