Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు సైగ చేసి బాలకృష్ణ బుద్ధి చెప్పివుంటే... ఆర్కే రోజా

Advertiesment
చంద్రబాబుకు సైగ చేసి బాలకృష్ణ బుద్ధి చెప్పివుంటే... ఆర్కే రోజా
, మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:18 IST)
ysrcp rk roja
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.రామారావుకు ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, అపుడే చంద్రబాబుకు బాలకృష్ణ సైగచేసి బుద్ధి చెప్పివుంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా అని  వైకాపాకు చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. 
 
ఆమె మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నపుడు తాను సైగ చేసివుంటే పరిస్థితి ఏమైవుండేదంటూ బాలయ్య వ్యాఖ్యానించారని ఆమె గుర్తు చేశారు. నిజంగా తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పివుంటే బాగుండేదన్నారు. 
 
చంద్రబాబు, బాలకృష్ణలు రాయలసీమ ద్రోహులని, వారిద్దరినీ త్వరలోనే రాయలసీమ నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. ఇకపోతే, ఏపీ శాసనసభలో అనుభవజ్ఞులైన పెద్దలకు అవకాశం కల్పించకుండా దద్దమ్మలకు స్థానం కల్పించారని ఆరోపించారు. ఆ సభలో ఉన్నవారంతా చంద్రబాబు భనజపరులే అని అన్నారు. 
 
అలాంటివారు సభలో ఉన్నాలేకపోయినా ఒక్కటేనని చెప్పారు. ఇక చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్‌ ఎమ్మెల్యేగా గెలవలేరనీ, ఆయన రాజకీయ భవిష్యత్ సమాధి కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. అందుకే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు.
 
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్నారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇకపోతే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వ జీవోల గురించి తెలియదన్నారు. మరోవైపు, జీవోల గురించి తెలిసిన చంద్రబాబు... తమ సర్కారు జారీచేసే జీవోలను చీకటి జీవోలంటూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేడారం జాతరకు నో ప్లాస్టిక్- భారీగా తరలివస్తున్న భక్తులు