Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ : చంద్రబాబు

మార్గదర్శకుడు జాతిపిత మహాత్మా గాంధీ : చంద్రబాబు
, గురువారం, 30 జనవరి 2020 (10:20 IST)
జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్థంతిని సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాజ్‌ఘాట్‌కు నివాళులు అర్పించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, జాతీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులు కూడా నివాళులు అర్పించారు. కాగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పిస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ గౌరవవందనం సమర్పిస్తున్నాను. 
 
దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టటమే కాకుండా, మనిషిని మహాపురుషునిగా చేసే సద్గుణాలను సూచించిన మార్గదర్శకుడు గాంధీజీ. "మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడమే దేశసేవ' అన్న గాంధీసూక్తి నాకు ఆదర్శం. మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌కు మందు... ఖాళీ కడుపుతో మూడు రోజులు ఆ మందు తీసుకుంటే...