Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాదికి కాటమరాయుడు విడుదల.. పొల్లాచ్చి నుంచి హైదరాబాదుకు వచ్చేసిన యూనిట్

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్- శ్రుతిహాసన్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ 'కాటమరాయుడు'. కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ ఫినిష్ చేసుకున్న యూనిట్, హైదరాబాద్‌కి చేరుకుంది. పవన్ కల్యాణ్ స్టైల్ ట్రెండ్ సెట్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (10:23 IST)
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్- శ్రుతిహాసన్ జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ 'కాటమరాయుడు'. కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ ఫినిష్ చేసుకున్న యూనిట్, హైదరాబాద్‌కి చేరుకుంది. పవన్ కల్యాణ్ స్టైల్ ట్రెండ్ సెట్ కాబోతోందని సినీ యూనిట్ తెలిపారు.

'పొల్లాచ్చి'లో పాటలు, సన్నివేశాలు అద్భుతంగా రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ. బ్యాలెన్స్ వర్క్ జనవరి లేదా ఫిబ్రవరిల్లో షినిష్ చేస్తామని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా వుంటాయని మేకర్స్ చెబుతున్న మాట. అంతా అనుకున్నట్లు జరిగితే 'ఉగాది'కి థియేటర్స్‌కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్ శరత్ మరార్.
 
షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత  పవన్ కల్యాణ్,శృతి హాసన్‌ల కాంబినేషన్ కాటమరాయుడులో మరోసారి కనువిందు చేయబోతోంది. పొల్లాచ్చిలో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. 
 
దర్శకుడు కిశోర్ పార్థసాని పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో 'ఉగాది'కి విడుదల అవుతుందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments