Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VakeelSaabTrailer_కేవలం ట్రైలర్‌కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమాకు..? (video)

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:24 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్'. 'అజ్ఞాతవాసి' తర్వాత దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ టైమ్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాలో లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ ట్రైలర్‌ను ఏపీలోని ఓ థియేటర్‌లో విడుదల చేస్తే అభిమానులు థియేటర్‌లోకి దూసుకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో థియేటర్‌ అద్దాలు పగిలాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇక వకీల్ సాబ్ విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచింది. పింక్ సినిమా రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఒరిజినల్‌లో లేని చాలా అంశాలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు. పవన్ మూడేళ్ల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్దాన్ని పగులకొట్టి మరీ వకీల్ సాబ్ టీజర్ రిలీజ్‌కు అభిమానులు ఎగబడటం ఈ వీడియో చూడవచ్చు. 
 
"ఇంకా కేవలం ట్రైలర్‌కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్‌కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం అండి. ఇది వైజాగ్ సంఘం థియేటర్లో ఈ సన్నివేశం." అంటూ నిర్మాత బండ్ల గణేష్ అభిమానుల వీడియోను పోస్టుచేస్తూ.. రాసుకొచ్చారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments