Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవ కట్టాకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్??

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (17:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రాజెక్టను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దేవ కట్టాకు దర్శకుడుగా అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ చిత్రం సూపర్ హిట్ సాధించింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. దీంతో దేవకట్టాతో ఓ చిత్రం చేయాలని పవన్ భావిస్తున్నారు.
 
ఇదిలావుంటే, ఇటీవలి కాలంలో సినిమాల పరంగా జోరు పెంచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు సినిమాలను లైనులో పెడుతున్నారు. వీటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు.
 
 ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చేస్తున్న పవన్.. దీని తర్వాత 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని పూర్తిచేస్తారు. అనంతరం హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలు చేయాల్సి వుంది. ఈ క్రమంలో ఆయన దేవ కట్టా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
 
రిపబ్లిక్ చిత్రంలో దేవ కట్టా సంధించిన వాడీవేడి పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి పవన్ కల్యాణ్‌ను కూడా బాగా నచ్చాయి. దాంతో ఆయన దేవ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
 
తన కోసం ఓ మంచి కథను రెడీ చేయమని పవన్ ఆయనకు చెప్పినట్టు, దీనికి దేవ కట్టా ఆనందంతో అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పనిలోనే దర్శకుడు దేవ నిమగ్నమైనట్టు సమాచారం. అయితే, కథ రెడీ అయినప్పటికీ, ప్రస్తుతం పవన్ కమిట్‌మెంట్స్ పూర్తయి, ఇది సెట్స్‌కు వెళ్లడానికి మరికొంత సమయం పట్టొచ్చు. 

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments