ఏదైనా కథకు హీరోగా చెయ్యాలంటే ఒడ్డు పొడుగు చూసి దర్శకులు ఎంపిక చేస్తుంటారు. కానీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మాత్రం కన్నులు చూసి ఎంపిక చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. `కొండ పొలం` అనే నవల చదివాక సినిమా తీయాలనుకున్నా. నిర్మాత కూడా ముందుకు వచ్చారు. నటీనటుల ఎంపిక టైంలో కథానాయకుడు ఎవరు! అని అనుకొంటుంటగా, ఉప్పెన సినిమాలోని `ఇష్కి షిఫాయా... నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో పడవ ప్రయాణం...` అనే పాటను చూసినప్పుడు వైష్ణవ్ తేజ్ `కొండపొలం` కథానాయకుడు దొరికేశాడు అని ఫిక్స్ అయ్యాను.
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు చెప్పాను. మీ మేనల్లుడు కన్నులు మీవి పోలికలు వుంటాయని చెప్పాను. కానీ వపన్‌గారు అవి నాకు సింక్ అవ్వడంకాదు. వాడి కళ్ళు మా నాన్నకన్నులు లాగా వుంటాయని అన్నారు. ఆ తర్వాత కొండపొలం నవల ఇచ్చాను. చవివారు. బాగుంది. ప్రొసీడ్ అన్నారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ అమ్మగారికి చెప్పి షూటింగ్ ప్రారంభించామని తెలిపారు.
కానీ నవలలో హీరోయిన్ పాత్ర లేదు. సినిమా పరంగా పెట్టాలని పలువురుని అనుకున్నాం. కొత్తవారైతే బెటర్ అని భావించాం. కానీ సినిమాటోగ్రాఫర్ మటుకు రకుల్ అయితే బాగుంటుందని అన్నారు. కెమెరామెన్ కనుక ఆయనకు ఓ విజన్ వుంటుందనిపించింది. ఇక ఆ తర్వాత అందరికీ నచ్చి ఆమెను ఓకే చేశాం అని చెప్పారు.