పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో శ్రమదానం చేశారు. శనివారంనాడు గాంధీ జయంతి సందర్భంగా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం రోడ్లన్నీ, గుంతలు, ఎగుడుదిగుడులు వుండడంతో ఆంధప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు రోడ్లను బాగుచేసేందకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలను కూడా పోలీసులు నివారించారు. ముందుగా పర్మిషన్ లేదని పోలీసులు చెప్పారు. దాంతో రెచ్చిపోయిన కార్యవర్తలు జై పవన్ కళ్యాణ్. సి.ఎం. పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.
రాజమండ్రిలో రోడ్లు అద్వాన్నంగా వుండడంతో పోలీసులు, అభిమానుల సమక్షంలోనే పవన్ కళ్యాణ్ పార పట్టుకుని శ్రమదానం చేశారు. అక్కడ బాలాజీ పేటలో ఆయన మాట్లాడుతూ, పనులు చేయలేనప్పడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వుంది.ప్రజలకు వున్న హక్కును ఎవరూ ఆపలేరు. వీర మహిళలకు నమస్కరాలు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మా ఆకాంక్ష. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు అండగా వుండాలని వచ్చానని తెలిపారు.