Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్రసాముతో అదరగొట్టిన PK తనయుడు.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:50 IST)
పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ కుమారుడు, అకీరానందన్ ఇప్పటికే స్టార్​ డమ్​ సంపాదించుకున్నాడు. పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. తండ్రిలాగే వెండి తెరను ఉర్రూతలూగిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అకీరా కర్రసాము చేస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. 
 
పవన్​ కల్యాణ్‌తో విడిపోయి మాజీ హీరోయిన్ రేణు దేశాయ్​ విడిగా ఉంటున్నా కూడా తాను ఎప్పుడూ అభిమానులతో టచ్​‌లో ఉంటుంది. అందుకోసమే పవర్​ స్టార్​ పిల్లల అప్డేట్లన్నీ తెలుగు ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంటాయి.
 
తాజాగా రేణు దేశాయ్​ సోషల్​ మీడియా వేదిక ఇన్​ స్టాగ్రామ్​‌లో ఓ వీడియోను పంచుకుంది. పవర్​ స్టార్​ కుమారుడు అకీరానందన్​ కర్ర సాము చేస్తున్న వీడియో అది. చాలా పెరిగిపోయిన అకీరా కర్ర సాముని ఇరగదీస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను రేణు అభిమానులతో పంచుకోవడం విశేషం. 
 
 ప్రస్తుతం రేణు దేశాయ్​ అప్లోడ్​ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన పవర్​ స్టార్​ అభిమానులు ఫుల్​ ఖుషీగా ఫీలవుతున్నారు. త్వరలోనే అకీరానందన్​ హీరోగా దర్శనం ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా పవన్​ కల్యాణ్​ , రేణు దేశాయ్​ లకు అకీరానందన్​ కాకుండా మరో సంతానం కూడా ఉంది.
 
ప్రస్తుతం రేణు దేశాయ్​ పవన్​ కల్యాణ్​ తో వేరుగా ఉంటుంది. పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్నాడు. కాగా… రేణు దేశాయ్​ అభిమానులతో ఎప్పుడూ టచ్​ లో ఉండడమే కాకుండా కరోనా లాక్​ డౌన్​ సమయంలో అనేక మందికి సాయం చేసింది. తాను దేశంలో జరుగుతున్న సమస్యలపై కూడా తన దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments