Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ తమ్ముడిగా పుట్టి అన్నయ్య అని పిలిచే అదృష్టం కలిగింది.. : పవర్ స్టార్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (09:55 IST)
మెగాస్టార్ చిరంజీవి ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ తమ్ముడిగా పుట్టి అన్నయ్య అని పిలిచే అదృష్టం కలిగిందంటూ జనసేనాని తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ ప్రకటన చేశారు. ఇదేవిషయంపై ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో... 
 
"అన్నయ్య చిరంజీవిగారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. 
 
కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthdayAnnayya!
 
ఇట్లు..
పవన్ కళ్యాణ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments