కాటమరాయుడుకి తర్వాత దాసరి సినిమాలో పవన్ కల్యాణ్.. ట్వీట్ల వెల్లువ..!
దర్శకరత్న దాసరి నారాయణ రావు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కాంబోలో సినిమా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. దాసరి నారాయణరావు, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో త్వరలో సినిమా ప్రా
దర్శకరత్న దాసరి నారాయణ రావు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కాంబోలో సినిమా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. దాసరి నారాయణరావు, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో త్వరలో సినిమా ప్రారంభం కానుంది. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. దాసరి నారాయణరావు సొంత నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సినిమా కూడా హారిక హాసిని బ్యానర్‌లో ఉంటుందని తెలిసింది. పవన్ మాత్రం ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. మిగిలిన రెండు సినిమాల్ని ఎప్పటికి పట్టాలెక్కిస్తాడో వేచిచూడాలి. ఇక కాటమరాయుడు టైటిల్‌ను ప్రకటించి పవన్ స్నేహితుడు, నిర్మాత శరత్ మరర్ బర్త్ డే విషెస్ అడ్వాన్స్‌గా తెలిపారు.
మరోవైపు పవర్‌స్టార్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..పక్కనే ‘పవర్’ ‘స్టార్’ గుర్తులను ట్వీట్ చేస్తూ పవన్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు బన్నీ. పవన్‌కళ్యాణ్ మూవీ జానీ లోగోను తయారుచేసి తెలుగు సినీ పరిశ్రమలో మొదటి రెమ్యునరేషన్ తీసుకున్నా..హ్యాపీ బర్త్ డే కళ్యాణ్‌గారు..లవ్ యు సర్ అంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు డైరెక్టర్ మారుతి. ఇలా పవన్ బర్త్ డేకి ట్వీట్లు వెల్లువెత్తాయి.