మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (23:24 IST)
తన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవిపై హీరో పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఓ ఫైటర్ అని, ఆయనకు రిటైర్మెంట్ లేదంటూ కితాబిచ్చారు. తెలుగు ప్రేక్షకులకు చిరంజీవిని హీరోగా పరిచయం చేసిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రం విడుదలై నేటికి 47 యేళ్లు పూర్తయింది. తన సుధీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి సోమవారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. దీనిపై పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా తన అన్నయ్యపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుని, అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
''ప్రాణం ఖరీదు'లో అన్నయ్య హీరోగా నటించిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడు మేం నెల్లూరులో ఉండేవాళ్లం. అప్పటికి నేను స్టూడెంట్‌ని. సినిమా చూసేందుకు కనకమహల్‌ థియేటర్‌కు వెళ్లినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల ప్రయాణంలో ప్రతి విషయంలోనూ అన్నయ్య ఎంతో ఎదిగాడు. ఇప్పటికీ అదే వినయం. ఇతరులకు అండగా నిలవడం, సహాయం చేయడంలో ఎలాంటి మార్పూ రాలేదు. 
 
ఆయన ఇలాగే ఎప్పుడూ విజయాలు అందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నా. భవిష్యత్తులో ఆయన్ను మరిన్ని విభిన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నా. అన్నయ్య అనుకుంటే తప్ప ఆయనకు రిటైర్మెంట్‌ అనేదే లేదు' అని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేశారు. చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాది రాళ్లు' అయినప్పటికీ.. విడుదలైన చిత్రం మాత్రం 'ప్రాణం ఖరీదు'. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments