Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయక్ 3 రోజుల్లో రూ. 100 కోట్లు దాటేసింది...

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:46 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాహుబలి భళ్లాలదేవ రానా కలిసి నటించిన భీమ్లా నాయకు రికార్డులు సృష్టిస్తోంది. కరోనా వైరస్ ఒకవైపు ఇబ్బందిపెడుతున్నా ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ మేనియా సాగుతోంది. ఈ చిత్రం 3 రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. చిత్రం ఘన విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హేపీగా ఫీలవుతున్నారు.

 
పవన్ అన్నతో రానాను చూస్తే చాలా సంతోషమన్న మనోజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ మూవీ "భీమ్లా నాయక్". ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్క సెలెబ్రిటీ తమ స్పందనను తెలుపుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ తన స్పందనను తెలుపుతూ, బిగ్ స్క్రీన్‌పై పవన్ అన్నతో కలిసి డార్లింగ్ రానాను చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. 
"సింగిల్ ఫ్రేమ్‌లో తాను ఎంతో అభిమానించే ఇద్దరు వ్యక్తులను చూడటం సంతోషంగా ఉంది. "భీమ్లా నాయక్" సక్సెస్‌‍కు సంబంధించి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సినిమా ఘన విజయం సాధించిన సందర్బంగా పవన్ అన్న, డార్లింగ్ రానా, త్రివిక్రమ్‌తో పాటు.. చిత్రం మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మంచు మనోజ్ అన్నారు. 
 
కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు నటించగా, రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో రావు రమేష్, సముద్రఖని, మురళీ శర్మ, రవిబాబు తదితరులు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments