పవన్ అన్నతో డార్లింగ్‌ను చూడటం ఎంతో సంతోషం : మనోజ్

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (15:39 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ మూవీ "భీమ్లా నాయక్". ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్క సెలెబ్రిటీ తమ స్పందనను తెలుపుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ తన స్పందనను తెలుపుతూ, బిగ్ స్క్రీన్‌పై పవన్ అన్నతో కలిసి డార్లింగ్ రానాను చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
"సింగిల్ ఫ్రేమ్‌లో తాను ఎంతో అభిమానించే ఇద్దరు వ్యక్తులను చూడటం సంతోషంగా ఉంది. "భీమ్లా నాయక్" సక్సెస్‌‍కు సంబంధించి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సినిమా ఘన విజయం సాధించిన సందర్బంగా పవన్ అన్న, డార్లింగ్ రానా, త్రివిక్రమ్‌తో పాటు.. చిత్రం మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మంచు మనోజ్ అన్నారు. 
 
కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు నటించగా, రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో రావు రమేష్, సముద్రఖని, మురళీ శర్మ, రవిబాబు తదితరులు నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments