Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతున్న 'అజ్ఞాతవసి'

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (10:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలకు పరిమితమైన తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ముఖ్యంగా, "అజ్ఞాతవాసి" చిత్రం తర్వాత ఆయన మేకప్ వేసుకోలేదు. దీనికి కారణం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నంకావడం వల్లే. అయితే, ఇపుడు మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రం పింక్ రిమేక్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమాలు చేయ‌నున్నాడ‌నే వార్తలు వచ్చాయి. ఇవి ఇపుడు నిజం కానున్నాయట.
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ నటించేందుకు సమ్మతించారట. పైగా, ఈ చిత్రం షూటింగ్ కోసం పది రోజుల కాల్షీట్స్‌ను కూడా కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఈనెల 20వ తేదీన 20న సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ఆయ‌న ఈ చిత్రానికి కాల్షీట్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు. 
 
ఇకపోతే, ఇక మ‌ణిర‌త్నం నిర్మాణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించే సినిమా కూడా పింక్‌తో సమాంత‌రంగా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ట‌. ఈ చిత్రానికి కూడా ప‌వ‌న్ 10 రోజుల కాల్షీట్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల‌కి క‌లుపుకొని దాదాపు వంద కోట్ల‌కి పైగా రెమ్యున‌రేష‌న్ ప‌వ‌న్ అందుకోనున్నాడ‌ని విశ్వ‌న‌య వ‌ర్గాల స‌మాచారంగా తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments