పూటగడవని స్థితిలో "పావలా శ్యామల"

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వివిధ రకాలైన పాత్రలను పోషించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన నటి పావలా శ్యామల. ప్రస్తుతం ఈమె ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. పూట గడవని కొట్టుమిట్టాడుతోంది. 
 
ఈమె ఖడ్గం, ఆంధ్రవాలా, బాబాయ్‌ హోటల్‌, గోలిమార్‌ వంటి సూపర్‌ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల్లో ఆమె ప్ర‌త్యేక న‌ట‌న‌తో అశేష ఆద‌ర‌ణ పొందింది. కానీ, ఇపుడు ఆమెకు సినిమా ఆఫ‌ర్స్ లేవు. దీంతో ఆర్థిక స‌మస్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంది. 
 
అప్ప‌ట్లో పావ‌లా శ్యామ‌లా ప‌రిస్థితి తెలుసుకున్న పవ‌న్ క‌ళ్యాణ్ కొంత ఆర్థిక సాయం చేయ‌గా, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10 వేల రూపాయల పెన్ష‌న్ కూడా వ‌స్తుంది.
 
ఆర్ధిక కార‌ణాల వ‌ల‌న పావలా శ్యామ‌లా ఇంటితో పాటు త‌న‌కు వ‌చ్చిన అవార్డులను కూడా అమ్ముకుంది. ప్ర‌స్తుతం అద్దె ఇంట్లో ఉంటుంది. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు. 
 
అయితే ఆమెకు కరాటె క‌ళ్యాణితో పాటు మా అసోసియేష‌న్ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. అంతేకాక ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు సాయం చేయాల‌ని కోరారు. పావ‌లా శ్యామ‌లాతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం విదిత‌మే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments